
Published 29 Jan 2024
వాట్సాప్(WhatsApp)లో మరో కొత్త ఫీచర్ వచ్చేసింది. ప్రముఖ మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్.. యూజర్ల(Users)ను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. మెటా యాజమాన్యంలోని ఈ ప్లాట్ఫామ్ గత కొన్ని సంవత్సరాలుగా అనేక మార్పులను చూసింది. వాట్సాప్ కొత్త ఛానెల్లను ప్రవేశపెట్టింది. యూజర్లు తమకు ఇష్టమైన అంశాల గురించి అప్డేట్గా ఉండటానికి ఇది వీలు కల్పిస్తుంది. తాజాగా బ్యాకప్ అవసరం లేకుండానే చాట్ హిస్టరీని కొత్త స్మార్ట్ ఫోన్(Smart Phone)కు బదిలీ(Transfer) చేసుకోవడానికి వీలు కల్పించింది.
వేగంగా, సులభంగా…
ఈ డేటాను బదిలీ చేసుకోవాలంటే రెండు పాత, కొత్త ఫోన్లను దగ్గర పెట్టుకోవాలి. క్లౌడ్ ఆధారంగా పనిచేసే బ్యాకప్ కంటే ఈ విధానం వేగం(Speed)గా, సులభం(Easy)గా ఉంటుంది. అయితే పాత, కొత్త ఫోన్లను ఒకే వైఫై(WiFi)కి కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం లొకేషన్ సర్వీస్ కూడా ఆన్ చేసుకోవాలి.
ఎలా ఫాలో కావాలంటే…
పాత ఫోన్ లో వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్ పై క్లిక్ చేయాలి.
చాట్ సెట్టింగ్స్ లోకి వెళ్లి అందులో చాట్ ట్రాన్స్ ఫర్ ను ఎంచుకోవాలి.
చాట్ ట్రాన్స్ ఫర్ మొదలవుతూనే అందుకు సంబంధించిన పాత ఫోన్ లో క్యూఆర్ కోడ్ ఓపెన్ అవుతుంది.
కొత్త ఫోన్ లో వాట్సప్ ఇన్ స్టాల్ చేయాలి.
అదే ఫోన్ తో లాగిన్ కావాలి.
పాత ఫోన్ కు వచ్చే వెరిఫికేషన్ కోడ్ ను కొత్త మొబైల్ లో ఎంటర్ చేయాలి.
కొత్త ఫోన్ లో కనిపించే క్యూఆర్ కోడ్ ను పాత ఫోన్ లోని స్కానర్ తో స్కాన్ చేయాలి.
అప్పుడు మీ పాత ఫోన్ లోని డేటా కొత్త మొబైల్ లోకి ట్రాన్స్ ఫర్ అవుతూ ఉంటుంది.
కొన్ని నిమిషాల పాటు ఇది కంటిన్యూ అవుతుంది.
ఇలాంటి సమయంలో రెండు ఫోన్లు పక్కపక్కనే ఉంచాల్సి ఉంటుంది.
ట్రాన్స్ ఫర్ టైమ్ లో మొబైళ్ల స్క్రీన్లు ఆన్ లోనే ఉంచాలి.