ఇంటర్నెట్ రోజురోజుకూ పెరిగిపోతున్న దృష్ట్యా ప్రస్తుతం ఏ పని చేయాలన్నా ఆన్ లైన్ మీద ఆధారపడాల్సి(Dependency) వస్తున్నది. నగదు రహిత లావాదేవీలకు ఆన్ లైన్(Online) సేవల్ని బాగా వాడుకుంటున్నారు. అందుకే ఇంటర్నెట్ విషయంలో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా తమ సర్వీసులకు ఆటంకం కలగకుండా ప్రతి చోటా వైఫై అందుబాటులో ఉంటున్నది. ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు కంపెనీలు సైతం తమ యూజర్ల(Users)కు అనుకూలంగా ఈ వైఫైని రెడీగా ఉంచుతున్నాయి. ఇక ప్రయాణాలు చేసే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లోనూ ఇదే పరిస్థితి కనపడుతున్నది. భారతీయ రైల్వే సైతం దేశవ్యాప్తంగా ప్రధాన స్టేషన్లలో వైఫై అందుబాటులో ఉంచింది.
ఉన్నా అందుకోలేని…
వైఫై ఉంటుందని తెలుసు.. దాన్ని వాడుకోవాలని అనుకోవడం కామన్. కానీ అదెలా వాడుకోవాలో చాలా మందికి తెలియకపోవడమే అసలు విశేషం. రైల్వేస్టేషన్లలో తమ వైఫై వాడుకోవాలంటూ స్వయంగా ఆ డిపార్ట్ మెంటే.. ప్రచార బోర్డులు పెడుతుంది. వాటిని చూడటమే తప్ప వైఫై వాడుకునేవాళ్లు చాలా తక్కువ. రైళ్ల(Trains) సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నా వైఫై ఉండాల్సిందే. ప్రైవేటు ఆపరేటర్ల నెట్ వర్క్ లు చాలా స్టేషన్లలో పనిచేయవు. సిగ్నల్స్ అందకపోవడం, జనాలు ఎక్కువగా ఉండటం వల్ల సరైన రీతిలో సిగ్నల్స్ లేక బఫరింగ్(Buffering) అవుతూనే ఉంటుంది. దీంతో విసిగి వేసారిపోయే యూజర్లు.. ఎందుకులే అనుకుని ఇంటర్నెట్ ను వదిలేస్తారు. కానీ అదే వైఫై అందుబాటులో ఉంటే మాత్రం సమాచారం చకచకా తెలిసిపోతుంది.
చిన్న అవగాహన లేకపోవడం వల్లే మనం వైఫైని రైల్వేస్టేషన్లలో ఎలా యూజ్ చేసుకోవాలో తెలుసుకోలేకపోతున్నాం. ఇప్పుడు రైల్వేస్టేషన్లలో వైఫై ఎలా వాడుకోవాలో చూద్దాం…
వైఫై వాడుకునేందుకు ఫాలో అవ్వాల్సిన స్టెప్ బై స్టెప్స్ ఇవే…
* వైఫై సెట్టింగ్స్ ఓపెన్(Open Wi-Fi Settings) : మీ స్మార్ట్ ఫోన్(Smart Phone) మొబైల్ డివైస్ లోని వైఫై సెట్టింగ్స్(Wi-Fi Settings) ఓపెన్ చేసుకోవాలి.
* సెర్చ్ ఫర్ నెట్ వర్క్(Search For Network) : వైఫై సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోగానే అక్కడున్న నెట్ వర్క్స్ కనిపిస్తాయి. అందులో ‘రైల్ వైర్’ నెట్ వర్క్(Railwire Network) సెలెక్ట్ చేసుకోవాలి.
* ‘రైల్ వైర్’ పోర్టల్ సందర్శన (Visit To Railwire Portal) : ‘రైల్ వైర్’ నెట్ వర్క్ కు కనెక్ట్ అయిన తర్వాత మీ మొబైల్ బ్రౌజర్ Railwire.co.in. నావిగేట్(Navigate) అవుతుంది.
* మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి(Enter Mobile Number) : ‘రైల్ వైర్’ పోర్టల్ లో ఇప్పుడు మీరు మీ 10 అంకెల మొబైల్ నంబర్ ను ఎంటర్ చేయాలి.
* ఓటీపీ రావడం(OTP Received) : ‘రైల్ వైర్’ పోర్టల్ లో మొబైల్ నంబర్ ఎంటర్ చేశాక అదే నంబర్ కు ఓటీపీ(OTP) వస్తుంది.
* ఓటీపీతో పాస్ వర్డ్(Authenticate Connection) : ఓటీపీ వచ్చిన తర్వాత దాన్నే పాస్ వర్డ్ గా నిర్ధరించుకుంటూ(Authentication) ‘రైల్ వైర్’ కనెక్ట్ అవుతుంది.
* ఇక ఎంజాయ్(Enjoy With Wi-Fi) : రైల్ వైర్ కనెక్ట్ కాగానే ఇక మొబైల్ లో వైఫై నిరంతరంగా వాడుకోవచ్చు.