ప్రముఖ IT(Information Technology) దిగ్గజ సంస్థ ‘విప్రో’… తమ ఉద్యోగులకు అత్యున్నత పదవులు కట్టబెట్టింది. మొత్తం 31 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్ లను కీలక స్థానాల్లోకి పంపుతున్నది. ఆరుగురు ఉద్యోగులు సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు(SVP)గా… మరో 25 మంది వైస్ ప్రెసిడెంట్లు(VP)గా ప్రమోట్ అవుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ మేరకు ఆయా ఉద్యోగులకు బెంగళూరు ప్రధాన కేంద్ర కార్యాలయంలో ఆర్డర్స్ అందజేశారు.
వీరికే పోస్టులు…
విప్రో చీఫ్ డెలివరీ ఆఫీసర్ అజిత్ మహలే, హెల్త్ కేర్ పోర్ట్ ఫోలియో(Portfolio) లీడర్ అనూజ్ కుమార్, క్యాప్కో CEO బెంజమిన్ సిమన్, కెనడా దేశ హెడ్ కిమ్ వాట్సన్, యూరప్ క్లౌడ్ సేల్స్ హెడ్ హెచ్.జి.శ్రీనివాస, క్లౌడ్ ఆర్మ్స్ స్ట్రాటజీ వై.సతీశ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లుగా పదోన్నతి(Promotion) పొందారు. సంస్థలో కీలకంగా వ్యవహరిస్తున్న వారికి ముఖ్య పదవులు కట్టబెట్టడం అనేది తమ కమిట్మెంట్ కు ఎగ్జాంపుల్ అని, దీనివల్ల కంపెనీ పనితీరు మరింత ఉన్నత శిఖరాలకు చేరుతుందని యాజమాన్యం ప్రకటించింది.
ఎగుమతులకు గాను…
250 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు గాను సాఫ్ట్ వేర్ ఎగుమతుల్ని మరింత పెంచనున్నట్లు విప్రో తెలిపింది. ఇప్పటివరకు కంపెనీలో లిమిటెడ్ పద్ధతిలో ప్రమోషన్లు ఇవ్వగా, గత కొన్ని నెలలుగా ఈ ప్రమోషన్ల సంఖ్యను పెంచుతూ కంపెనీ నిర్ణయం తీసుకుంది.