Published 20 Jan 2024
యూట్యూబ్(Youtube)… ఈ సామాజిక మాధ్యమం(Social Media) పేరు తెలియని వారు చాలా తక్కువేమో. ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ యూజర్ల సంఖ్య ఏటేటా పెరుగుతూనే ఉంది. స్మార్ట్ ఫోన్లు వాడుతున్నవాళ్లు, వాడనివాళ్లకు సైతం యూట్యూబ్ పేరు సుపరిచితం(Well Known). ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ అయిన యూట్యూబ్ లో కంటెంట్ క్రియేటర్లకు కొదువే లేదు. యూట్యూబ్ అకౌంట్ ఓపెన్ చేయడం, అందులో వీడియోలు అప్ లోడ్ చేయడానికి కంటెంట్ క్రియేటర్లే అక్కర్లేదు.. దాని గురించి ఏ కొంచెం తెలిసినవారైనా ఆ పని చేయవచ్చు. ఈ ప్లాట్ ఫామ్ ద్వారా నెలకు లక్షల్లో సంపాదిస్తున్న వ్యక్తులు ఎందరో ఉన్నారు. ఏ చిన్న సమాచారం కావాలన్నా వీడియోల ద్వారా తెలుసుకునేందుకు ఆశ్రయించే ఏకైక సాధనంగా యూట్యూబ్ నిలిచిపోయింది.
Also Read: ఆర్టీసీ ఉద్యోగులకు భారీ ఊరట…
ప్రపంచంలో మనమే టాప్…
యూట్యూబ్ యూజర్ల పరంగా చూస్తే ప్రపంచంలోని అన్ని దేశాల కన్నా మిన్నగా భారతదేశమే మొదటి స్థానం(Top Place)లో ఉంది. మొత్తం దేశవ్యాప్తంగా 467 మిలియన్ల(46.7 కోట్ల) మంది యూజర్లు యూట్యూబ్ డౌన్ లోడ్ చేసుకున్నారు. అంటే దేశంలో మూడో వంతు జనాభా యూట్యూబ్ యూజర్లుగా ఉన్నారన్నమాట. ఇంతలా మరే దేశమూ మన సమీపంలో లేదంటే ఆశ్చర్యం అనిపించకమానదు. 24.6 మిలియన్ల(24.6 కోట్ల)తో అగ్రరాజ్యం అమెరికా రెండో స్థానంలో నిలిచింది. అంటే ఇంచుమించు భారత్ యూజర్లలో అమెరికా సంఖ్య సగంగా ఉందన్నమాట.
Also Read: హీరోయిన్ రష్మిక అసభ్యకర వీడియో … అతడి పనే…
ఇక 5.79 కోట్ల యూజర్లతో తుర్కియే పదో స్థానంలో, 4.59 కోట్లతో ఈజిప్టు 15వ ప్లేస్ లో నిలవగా 3.31 కోట్లతో కెనడా 20వ స్థానాన్ని ఆక్రమించింది. ఒక్క 2022 సంవత్సరంలోనే ప్రపంచవ్యాప్తం(Worldwide)గా ఈ సామాజిక మాధ్యమ యాప్ ను 15.4 కోట్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు.
టాప్-10 జాబితా ఇలా…
- భారత్ – 46.7 కోట్లు
- అమెరికా – 24.6 కోట్లు
- బ్రెజిల్ – 14.2 కోట్లు
- ఇండొనేషియా – 13.9 కోట్లు
- మెక్సికో – 8.18 కోట్లు
- జపాన్ – 7.84 కోట్లు
- పాకిస్థాన్ – 7.17 కోట్లు
- జర్మనీ – 7.09 కోట్లు
- వియత్నాం – 6.3 కోట్లు
- తుర్కియే – 5.79 కోట్లు