
ఈ వారంలోనే పర్వతారోహకులు హిమాలయాలు ఎక్కే ప్రక్రియ మొదలవుతుంది. శిఖరాలకు అధిరోహించే వారిలో తలనొప్పి, వాంతులు, విరేచనాలు అవడాన్ని ‘మౌంటేన్ సిక్ నెస్’ అంటారు. అయితే శిఖరాల్ని ఎక్కేవారిని కావాలనే అనారోగ్యం బారిన పడేలా ఆహారంలో బేకింగ్ సోడా వేస్తున్నారు. అది తిన్న పర్వతారోహకులకు జీర్ణాశయ సమస్యలతో ఎమర్జెన్సీ వైద్యం అవసరమవుతుంది. అలా అప్పటికప్పుడు హెలికాప్టర్లు వాడేలా చేసి రూ.186 కోట్ల మోసాలకు పాల్పడ్డట్లు నేపాల్ పోలీసులు గుర్తించారు. ఈ డబ్బును హెలికాప్టర్ కంపెనీలు, ట్రెక్కింగ్ సంస్థలు, ఆస్పత్రులు ఉమ్మడిగా పంచుకుంటున్నట్లు గుర్తించారు. అక్రమార్కులు ఇలా దేన్నీ వదిలిపెట్టట్లేదు.