100 జిల్లాల్లో వ్యవసాయ రంగ అభివృద్ధికి ‘ప్రధానమంత్రి ధన్-ధాన్య కృషి యోజన’ స్కీంకు అమలు కానుంది. ఏటా రూ.24 వేల కోట్లు వెచ్చించే ఈ పథకానికి మోదీ కేబినెట్ ఆమోదం తెలిపింది. పంటల వైవిధ్యం, నీరు-నేల ఆరోగ్య పరిరక్షణ.. దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాల్ని సులభతరం చేయడం ఉద్దేశం. 11 విభాగాల్లోని 36 స్కీములు, రాష్ట్రాల పథకాల్ని ఏకం చేసి ప్రైవేటు రంగ భాగస్వామ్యంతో అమలు చేస్తారు. ఇందుకోసం జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కమిటీలు వేస్తారు. తక్కువ పంటలు, తక్కువ ప్రొడక్షన్, తక్కువ రుణ ప్రక్రియ అనే 3 అంశాల ఆధారంగా జిల్లాల్ని గుర్తిస్తారు. ఆరేళ్లు గల స్కీమ్ 2025-26 నుంచి మొదలవుతుండగా, ప్రతి రాష్ట్రం నుంచి ఒక జిల్లా ఉండేలా చూస్తారు. మరిన్ని వార్తలకు క్లిక్ చేయండి…: https://justpostnews.com