JEE మెయిన్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు 100 పర్సంటైల్ సాధించారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది రాసిన పరీక్షల్లో 14 మంది 100 పర్సంటైల్ దక్కించుకున్నారు. తెలంగాణ నుంచి బనిబ్రత మాజీ అనే విద్యార్థి, APలోని గుత్తికొండకు చెందిన సాయి మనోజ్ఞ ఉన్నారు. విద్యార్థులు సాధించిన పర్సంటైల్ తో JEE మెయిన్(2025 Results) విడుదలయ్యాయి. NITలు, ట్రిపుల్ ITల్లో బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు గాను జనవరి 22, 23, 24, 28, 29 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు.