11 మంది జవాన్లు గల్లంతైన ఘటన ఉత్తరాఖండ్(Uttarakhand) ఉత్తరకాశీ జిల్లాలో జరిగింది. కుంభవృష్టితో నదులు ఉప్పొంగి ధరాలి, సుఖి గ్రామాలు ఇప్పటికే కొట్టుకుపోగా.. హార్సిల్(Harsil) ప్రాంతంలోని జవాన్లు కనిపించకుండా పోయారు. రోడ్లు దెబ్బతిని, బ్రిడ్జిలు కూలిపోగా బాధితుల కోసం 225 మంది సైనికుల్ని రంగంలోకి దించారు. తప్పిపోయిన వారి కోసం ఏడు టీంలు జల్లెడ పడుతున్నాయి. ఆగకుండా వర్షాలు పడుతుండటంతో సహాయ చర్యలకు ఇబ్బంది ఏర్పడింది. ఆ రాష్ట్రంలో ఇప్పటికే ఐదుగురు చనిపోగా, 100 మంది ఆచూకీ దొరకలేదు. 413 మందిని సైన్యం రక్షించింది.