ఉన్నట్టుండి నాలుగంతస్తుల భవనం కూలిన ఘటనలో 11 మంది మృతిచెందారు. ఢిల్లీలోని ముస్తఫాబాద్(Mustafabad)లో జరిగిన ఘటనలో మరో 11 మందిని రక్షించారు. శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత 2:39 గంటలకు ప్రమాదం సంభవించింది. తొలుత నలుగురు చనిపోయారని గుర్తించగా, సాయంత్రానికి ఆ సంఖ్య 11కు చేరింది. ఈ భవనం 60 ఏళ్ల తెహసీన్ ది కాగా.. అతడు కూడా అందులోనే ప్రాణాలు కోల్పోయాడు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు, నలుగురు పిల్లలు మృత్యువాత పడ్డారు. పోలీసులు, NDRF దళాలు సహాయ చర్యలు చేపడుతున్నాయి. ఢిల్లీలో నిన్న వాతావరణం(Weather) ఒక్కసారిగా మారి జోరుగా వర్షం పడింది. ఈ ప్రభావంతోనే బిల్డింగ్ కూలినట్లు భావిస్తుండగా, ఆ దృశ్యాలు CC కెమెరాల్లో రికార్డయ్యాయి.