23 నిమిషాల్లో పాకిస్థాన్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాల్ని(Terror Camps) ధ్వంసం చేసిన భారత ఆర్మీ… కేవలం మూడు నిమిషాల్లోనే 13 బంకర్లను తునాతునకలు(Destroyed) చేసింది. మే 6, 7 తేదీల్లో మనపైకి రెండు మోటార్ బాంబులను శత్రు దేశం ప్రయోగించింది. కానీ వెంటనే భద్రతాదళాలు కేవలం 3 నిమిషాల్లోనే 13 బంకర్లను ధ్వంసం చేశాయి. ఇందుకోసం ప్రతి జవాను తమ కమాండర్ ఆజ్ఞ కోసం ఎదురుచూడగా, ఆదేశాలు రాగానే రంగంలోకి దిగి పాక్ కు కాళరాత్రులు చూపించారు. ఇలా ‘ఆపరేషన్ సిందూర్’తో పాక్, దాని ఆక్రమిత కశ్మీర్ లోని స్థావరాలన్నీ నేలకూలాయి.