మరో భారీ ఎన్ కౌంటర్లో మావోయిస్టులకు భారీ దెబ్బ తగిలింది. ఛత్తీస్ గఢ్ సుక్మా(Sukma) జిల్లాలో దండకారణ్యం(Deep Forest)లో ఇరువర్గాలకు జరిగిన ఎదురుకాల్పుల్లో భారీగా ప్రాణనష్టం జరిగింది. ఉపంపల్లి అటవీప్రాంతంలోని గోగుండా కొండపైన హోరాహోరీ కాల్పులు నాలుగు గంటలుగా కొనసాగుతున్నాయి. గత కొన్ని నెలలుగా ఆ రాష్ట్రంలో వందలాది మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. గత వారమే బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో 30 మంది మావోయిస్టులు చనిపోయారు.