25 నిమిషాల్లో 24 క్షిపణులు…
అర్థరాత్రి 1:05 నుంచి 1:30 గంటలు…
భూతల, ఆకాశ మార్గాన దాడులు…
ఇలా భారత్ జరిపిన ముప్పేట(All Forces) దాడితో పాకిస్థాన్ లోని ఉగ్రవాద శిబిరాలు నేలమట్టమయ్యాయి. ఉగ్రవాదుల కోసం POK చుట్టూ రిక్రూట్మెంట్ కేంద్రాలు, లాంచ్ ప్యాడ్ లను పాక్ నిర్మిస్తోంది. నిఘా వర్గాల పక్కా సమాచారంతో వీటినే లక్ష్యంగా చేసుకుంది భారత సైన్యం. ముజఫరాబాద్, కోట్లి, రావల్కోట్, బహవల్పూర్, చక్వారీ, భీంబర్, నీలం వ్యాలీ, జీలం, చక్వాల్ లో దాడులు చేసింది. ఈ కేంద్రాలన్నీ లష్కరే తొయిబా, జైషే మహ్మద్ కు కీలకంగా ఉన్నాయి. ఇందులో ముజఫరాబాద్, భీంబర్ ను.. ఉగ్రవాదుల రవాణా, లాజిస్టిక్ పాయింట్లుగా గుర్తించింది. ఈ దాడుల్లో అక్కడి UAV కమాండ్ సెంటర్లు, ట్రెయినింగ్ సెంటర్లు, ఆయుధ డిపోలు నాశనమయ్యాయి. 70 మంది ఉగ్రవాదులు మరణించగా, మరో 60 మంది గాయపడ్డట్లు సైన్యాధికారులు ప్రకటించారు. కానీ ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి.