పెద్దయెత్తున వస్తున్న వరదలతో పంజాబ్ దయనీయంగా మారింది. మొత్తం 23 జిల్లాలపై ప్రభావం పడటంతో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. 1988 తర్వాత ఈ స్థాయిలో వరదలు రావడం ఇదే తొలిసారి. భారీ వర్షాలతో సట్లెజ్(Sutlej), బియాస్(Beas), రావి నదులు ఉప్పొంగి నీరు ఇళ్లల్లోకి చేరింది. ఈ మూడు నదుల క్యాచ్ మెంట్ ఏరియాలు హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్ ప్రాంతాల్లోని కుంభవృష్టితో పంజాబ్ పై ప్రభావం పడింది. ఈ నెల 7 వరకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.