24 గంటల్లో కురిసిన 10 సెంటీమీటర్ల వర్షంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో నిన్నట్నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. హరినగర్ జైత్ పూర్ ఏరియాలోని గోడ కూలి అక్కడివారిపై పడింది. శిథిలాల్లో చిక్కుకుని ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఇందులో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు, మరో ఇద్దరు బాలికలున్నారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. షబీదుల్(30), రబీదుల్(30), ముత్తు అలీ(45), రుబీనా(25), డాలీ(25), రుక్సానా(6), హసీనా(7) చనిపోయిన వారిలో ఉన్నారు.