ఢిల్లీ లిక్కర్ స్కామ్(Liquor Scam) మనీ లాండరింగ్ వ్యవహారంలో ‘ఆమ్ ఆద్మీ పార్టీ(AAP)’ పడుతున్న ఇబ్బందులు ఎలా ఉన్నాయో చూస్తూనే ఉన్నాం. ముఖ్యమంత్రి, డిప్యుటీ CM, రాజ్యసభ సభ్యుడు.. ఇలా కీలక నేతలంతా కారాగార(Jail) వాసం అనుభవిస్తున్నారు. ఇప్పటికే కేజ్రీవాల్ కు CBI కోర్టు, హైకోర్టుల్లో షాక్ తగలగా.. చివరకు అటు సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court)లోనూ ఎదురుదెబ్బ తగిలింది.
ఒకే రోజు రెండు…
కేజ్రీవాల్ పరిస్థితి ఇలా ఉంటే ఆయన కేబినెట్ మంత్రి పార్టీకి రాజీనామా చేశారు. AAP అవినీతిలో కూరుకుపోయిందంటూ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్.. పదవికి, పార్టీకి రాజీనామా పంపారు. ఆయన ప్రస్తుతం ఢిల్లీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ప్రజలకు సేవ చేసేందుకు పార్టీలో చేరానని, కానీ అవినీతిలో ఆప్ కూరుకుపోయిందంటూ ఈ విషయం హైకోర్టు తీర్పు తర్వాత అర్థమైందని అన్నారు.
సుప్రీంలోనూ…
ED అరెస్టును సవాల్ చేస్తూ తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ నిన్న ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్ పై న్యాయస్థానం గట్టిగా మొట్టికాయలు వేసింది. ED రిపోర్టులో ఆధారాలున్నాయని, CM అయినంత మాత్రాన ఇష్టమొచ్చినట్లు కుదరదంటూ హాట్ కామెంట్స్ చేసింది. దీనిపై ఈరోజు సుప్రీం మెట్లెక్కారు కేజ్రీవాల్. తమ పిటిషన్ పై అత్యవసర విచారణ(Emergency Hearing) జరపాలని కోరితే న్యాయస్థానం తిరస్కరించింది. ఈరోజే ఎమర్జెన్సీగా మీ కేసును విచారించలేమంటూనే దాన్ని పరిశీలించి త్వరలోనే ఓ తేదీని ప్రకటిస్తామని స్పష్టం చేసింది. ఇలా కేజ్రీవాల్ కు కోర్టుల్లో షాక్ తగలడం, అటువైపు కీలక నేతలు దూరమవడం ‘ఆప్’ను కోలుకోలేని దెబ్బతీసింది.