

ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువును కేంద్రం మరోసారి పెంచింది. 2023 సెప్టెంబరు 14 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చింది. గతంలో విధించిన గడువు ఈ నెల 14తో ముగియగా, చాలా మంది ఇప్పటివరకు అప్డేట్ చేసుకోలేకపోయారు. యూఐడీఏఐ నిబంధనల ప్రకారం ప్రతి 10 ఏళ్లకోసారి ఆధార్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మై ఆధార్ పోర్టల్ ద్వారా మాత్రమే ఫ్రీ సర్వీసెస్ అందుబాటులో ఉంటాయి. మార్చి 15 నుంచి అప్డేట్ అవకాశాన్ని యూఐడీఏఐ కల్పిస్తోంది.