ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసం(Residence)లో నిర్వహించిన పబ్లిక్ మీటింగ్ లో CMపైనే దాడి జరగడం సంచలనం రేపింది. ఫిర్యాదుదారుడిగా వచ్చి దాడికి పాల్పడ్డ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 41 ఏళ్ల రాజేశ్ భాయ్ ఖిమ్జి భాయ్ సక్రియాగా నిఘా వర్గాలు గుర్తించాయి. గుజరాత్(Gujarat) రాజ్ కోట్ కు చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు. వెంటనే గుజరాత్ పోలీసులకు సమాచారం అందించి అతడి ఇంతకుముందటి చరిత్రపై ఆధారాలు సేకరిస్తున్నారు. ఒక ముఖ్యమంత్రికే భద్రత లేకుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ దేవేందర్ యాదవ్ అన్నారు.