మహారాష్ట్రలో బుల్డోజర్ యాక్షన్ మొదలైంది. నాగపూర్ అల్లర్ల(Riots) ప్రధాన నిందితుడి ఇంటిని అధికారులు కూల్చివేశారు. ఫహీమ్ ఖాన్, అబ్దుల్ హఫీజ్ అల్లర్లకు కారకులని గుర్తించారు. తొలుత ఫహీమ్ ఇంటి కూల్చివేత మొదలుపెట్టారు. అతడి తల్లి మెహరున్నీసా(69) అప్పటికప్పుడు బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ లో పిటిషన్ వేశారు. దీంతో కూల్చివేతలపై కోర్టు స్టే విధించినా ఆలోపే జరగాల్సింది జరిగిపోయింది. హఫీజ్ ఇంటిని మాత్రం ఆపారు అధికారులు. ఉత్తరప్రదేశ్ లో యోగి సర్కారు బుల్డోజర్ యాక్షన్ ను మొదలుపెట్టింది. పలువురు నిందితుల నివాసాలు ధ్వంసం చేయగా, ఇకనుంచి ఆ పని చేయొద్దంటూ అన్ని రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. కానీ నాగపూర్ అల్లర్లలో పెద్ద విధ్వంసం జరగడంతో ఫడ్నవీస్ సర్కారు సైతం అదే నిర్ణయాన్ని అమలు చేసింది.