
సైనిక దళాల్లో నియామకాల కోసం జరిపే అగ్నివీర్ రిక్రూట్ మెంట్ ర్యాలీని సెప్టెంబరులో నిర్వహించనున్నారు. సెప్టెంబరు 1 నుంచి 8వ తేదీ వరకు ఈ ర్యాలీ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 17 నుంచి 26 వరకు ఆన్లైన్ పరీక్షలు జరగ్గా.. అందులో అర్హత పొందినవారికి ఈ ర్యాలీలో పాల్గొనే అవకాశం ఉంటుంది. క్వాలిఫై(Qualify) అయిన వారికి మెయిల్ ద్వారా సమాచారం(Information) పంపించారు.
క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ర్యాలీ కోసం వచ్చేటపుడు తాము సూచించిన సర్టిఫికెట్లు తీసుకురావాలని అధికారులు స్పష్టం చేశారు.