రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం మరోసారి భారీగా నిధుల్ని కేటాయించింది. ఏడు మేజర్ ప్రాజెక్టుల కోసం మొత్తంగా రూ.14,000 కోట్లు వెచ్చిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సాంకేతిక వ్యవసాయం(Digital Agriculture), ఆహార భద్రత, స్థిరమైన వ్యవసాయం దిశగా సాగును ఆధునికీకరించేందుకు(Modernise) నిధులు కేటాయించింది.
క్రాప్ సైన్స్, ఫుడ్, న్యూట్రిషనల్ సెక్యూరిటీకి రూ.3,979 కోట్లు.. అగ్రి ఎడ్యుకేషన్, మేనేజ్మెంట్, సోషల్ సైన్సెస్ కోసం రూ.2,291 కోట్లు.. సస్టెయినెబుల్ లైవ్ స్టాక్, హెల్త్, ప్రొడక్షన్ కు రూ.1,702 కోట్లు.. ఉద్యానశాఖ(Horticulture)కు రూ.860 కోట్లు.. కృషి విజ్ఞాన కేంద్రాలకు రూ.1,202 కోట్లు.. నేచురల్ రీసోర్సెస్ మేనేజ్మెంట్ కోసం రూ.1,115 కోట్లను అందజేయనుంది.