గుజరాత్ లోని అహ్మదాబాద్(Ahmedabad)లో విమానం కుప్పకూలింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే మేఘనీనగర్ ప్రాంతంలో కూలిపోయి భారీగా పొగలు వచ్చాయి. బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ లో 300 మంది దాకా ప్రయాణించొచ్చు. 242 మందితో లండన్(London) బయల్దేరిన విమానంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. లండన్ వరకు వెళ్లాల్సిన ప్లేన్ లో భారీగా ఇంధనం(Fuel) ఉంది. హైడ్రాలిక్ లీక్ లా, చెట్టును ఢీకొట్టిందా, ఇతర టెక్నికల్ సమస్యలా, ప్రకృతి వైపరీత్యం ఏర్పడిందా అన్నది తేలాల్సి ఉంది.