
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) మానవులను భర్తీ చేస్తుందా అన్న చర్చపై షాదీ డాట్ కామ్ ఫౌండర్ అనుపమ్ మిట్టల్ తనదైన శైలిలో స్పందించారు. 20 వాట్ల శక్తితో అత్యంత సంక్లిష్టంగా పనిచేసే మానవ మెదడును అనుకరించడం ఏఐకి సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఒక వ్యక్తి ఆలోచనలు, నిర్ణయాలు, అభ్యసన సామర్థ్యాన్ని కేవలం ఒక డేటా సెంటర్ ద్వారా మాత్రమే కాకుండా.. గ్రహమంత పరిమాణం గల కంప్యూటర్ ద్వారా కూడా ప్రస్తుత టెక్నాలజీతో భర్తీ చేయలేమన్నారు. ఏఐ అనేది ఆటోమేషన్, డేటా విశ్లేషణలో మాత్రమే మెరుగ్గా ఉంటుందని.. లక్షలాది సంవత్సరాల పరిణామ క్రమంలో మానవుడు సాధించిన సృజనాత్మకతను అస్సలే అందుకోబోదన్నారు.