తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(PCC) అధ్యక్షుడి విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం(High Command) ఎటూ తేల్చుకోలేకపోయింది. ఈ నియామకాన్ని తాత్కాలికంగా వాయిదా వేసింది. రాష్ట్ర నేతల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతోనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ చీఫ్ నియామకంపై చర్చించేందుకు CM రేవంత్, డిప్యూటీ CM భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లారు.
అగ్రనేతలు ఖర్గే, రాహుల్, కె.సి.వేణుగోపాల్, దీపాదాస్ మున్షీలతో చర్చించిన తర్వాత పీసీసీ ప్రెసిడెంట్ నియామకం జరగాల్సి ఉంది. దీనిపై కీలక నేతలంతా విస్తృతంగా చర్చించారు. వెనుకబడిన వర్గానికి(BC) చెందిన వ్యక్తికే పీఠం దక్కుతుందన్న ప్రచారం మూణ్నాలుగు రోజులుగా జోరుగా సాగింది.
CM, డిప్యూటీ CM పూర్తిస్థాయిలో మంత్రాంగం జరపడంతో ఇక పీసీసీ చీఫ్ పేరు ప్రకటనే తరువాయి అనుకున్నారు. కానీ ఇంతలోనే దాన్ని వాయిదా వేశారు. దీన్నిబట్టి కేబినెట్ విస్తరణ తర్వాతే పీసీసీ అధ్యక్షుడి నియామకం ఉండబోతున్నట్లు ఢిల్లీ వర్గాలు అంటున్నాయి.
Nice.. స్టోరీ