నరేంద్ర మోదీ ప్రభుత్వంలో అజిత్ దోవల్ కు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. గత రెండు పర్యాయాలు(Two Terms) ఆయన్ను మోదీ సర్కారు జాతీయ భద్రతా సలహాదారు(National Security Adviser)గా నియమించింది. భద్రతా వ్యవస్థకు కళ్లు, చెవులుగా భావించే ఈ పోస్టుకు తాను ఎంత సమర్థుడో స్వయంగా నిరూపించారాయన.
అందుకే మోదీ సర్కారు మూడోసారి అధికారం(Power)లోకి వచ్చిన వెంటనే మళ్లీ ఆయనకు కీలక బాధ్యతలు కట్టబెట్టింది. ఆయన నియామకం ఈ నెల 10 నుంచే ప్రారంభమవుతుందని కేబినెట్ నియామకాల కమిటీ ప్రకటించింది. ప్రధానమంత్రి పదవీకాలంతో సమానంగా లేదంటే PM నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఆయన ఈ పదవిలో ఉంటారని తెలిపింది.
జమ్మూకశ్మీర్లో వరుస ఉగ్రవాద దాడులు జరగడం, అక్కడి శాంతిభద్రతలపై ప్రధాని రివ్యూ నిర్వహిస్తున్న పరిస్థితుల్లో రిటైర్డ్ IPS అజిత్ దోవల్ కు కీలక బాధ్యతలు అప్పగించారు. అటు రిటైర్డ్ IAS పి.కె.మిశ్రాను ప్రధాని ముఖ్య కార్యదర్శిగా నియమించారు.