కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక అంశాన్ని మరోసారి ప్రస్తావించారు. పౌరసత్వ సవరణ చట్టం(Citizenship Ammendment Act)ను లోక్ సభ ఎన్నికలకు ముందే అమలు చేస్తామని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ దేశాల్లో హింస బారిన పడి ఆశ్రయం కోసం భారత్ కు వచ్చే వారికి పౌరసత్వం ఇవ్వడమే CAA ఉద్దేశమని గుర్తు చేశారు. ఈ విషయంలో ముస్లిం సోదరుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, ఏ ఒక్కరి పౌరసత్వాన్ని లాక్కోవడం తమ ఉద్దేశం కాదని అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ లో ఆయన మాట్లాడారు.
త్వరలోనే నిర్ణయాలు…
పొత్తులపై త్వరలోనే నిర్ణయాలుంటాయని, రాజకీయ కూటమి(Alliance) ఎంత పెద్దగా ఉంటే అంత మంచిదని అమిత్ షా అన్నారు. మేం ఆర్టికల్ 370 రద్దు చేశాం కాబట్టి వచ్చే ఎన్నికల్లో 370 సీట్ల గురించి మాట్లాడుతున్నారు. కానీ మేం 400కు పైగా సీట్లను సాధించి మూడోసారి అధికారంలోకి రాబోతున్నామన్నారు. కుటుంబ నియంత్రణ(Family Planning)ను నమ్ముతాం కానీ అది రాజకీయాలకు మాత్రం వర్తించదు అని కేంద్ర హోంమంత్రి క్లారిటీ ఇచ్చారు.
Published 10 Feb 2024