పాకిస్థాన్ పై జరిపిన దాడిని ఆ దేశ ఫోన్ కాల్ తో ఆపేశామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amith Shah) తెలిపారు. ‘ఆ దేశ DGMO మే 10న మన DGMOకు ఫోన్ చేశారు.. అప్పటికే మనం 9 ఎయిర్ బేస్(Airbase)లను ధ్వంసం చేశాం.. దీంతో దాయాది దేశం శరణు వేడుకుంది.. ఇది భారత్ పై జరిగిన దాడి కాబట్టే విరుచుకుపడ్డాం.. పహల్గాం దాడి చేసింది పాక్ ఉగ్రవాదులేనన్న సాక్ష్యాలున్నాయి… ఆ దేశానికి చెందిన సర్టిఫికెట్లు, చాక్లెట్లు దొరికాయి.. శత్రు దేశం వేడుకోవడం వల్లే పోరును ఆపేశాం.. ఇవన్నీ పక్కనపెట్టి కొందరు పాక్ ను సమర్థిస్తున్నారు..’ అంటూ ప్రతిపక్షాలని ఉద్దేశిస్తూ హోంమంత్రి లోక్ సభలో అన్నారు.