నియోజకవర్గాల పునర్విభజన(Delimitation)పై పెద్ద చర్చ నడుస్తోంది. లోక్ సభ, అసెంబ్లీల సెగ్మెంట్లను ఎలా విభజిస్తారు.. ఏ ప్రాతిపదికన పెంపు ఉంటుంది.. రిజర్వేషన్లకు దేన్ని ఆధారంగా తీసుకుంటారు.. అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు నష్టమనే వాదన ఉండగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. సీట్లు తగ్గిపోతాయన్నది వాస్తవం కాదని, దక్షిణాది రాష్ట్రాలకు తాను హామీ ఇస్తున్నానని ప్రకటించారు. రాష్ట్రాల జనాభా ఆధారంగా 2026లో పునర్విభజన ద్వారా లోక్ సభ సీట్లను కేటాయించాలన్నది ప్రతిపాదన. ప్రస్తుతమున్న సీట్లు 1971 లెక్కలతో ఏర్పాటైనవి. ఆ తర్వాత దక్షిణాదిలో జనాభా తగ్గితే, ఉత్తరాదిలో భారీగా పెరిగింది. అలా కేరళలో 20కి గాను 8, తమిళనాడులో 8, తెలంగాణ, APల్లో నాలుగు సీట్ల చొప్పున కోల్పోతాయని విశ్లేషకుల మాట.