ప్రముఖ సామాజిక కార్యకర్త(Social Worker) అన్నా హజారే.. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై తన అభిప్రాయాల్ని పంచుకున్నారు. అధికార దాహంతోనే అరవింద్ ఓడిపోయారంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయని.. డబ్బు, అధికారాన్ని దుర్వినియోగం చేసినందునే ప్రజలు ఓడించారన్నారు. గతంలోనూ అరవింద్ ను అన్నాహజారే హెచ్చరించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం బయటపడ్డప్పుడు పలు సూచనలు చేసినా దాన్ని ఆయన పట్టించుకోలేదు. కేజ్రీవాల్ ఈ స్థాయికి రావడానికి ఒకరకంగా అన్నాహజారేతో ఉన్న సాన్నిహిత్యం(Closeness) కూడా కారణం.
గతంలో కేజ్రీవాల్ తో కలిసి అన్నా హజారే… అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని ఢిల్లీ రాంలీలా మైదానంలో నిర్వహించారు. ఆమ్ ఆద్మీ పార్టీని ప్రారంభించి రెండుసార్లు అధికారం చేపట్టేవరకు హజారేతో సాన్నిహిత్యం కొనసాగింది. కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పరువంతా గంగలో కలవడంతోపాటు అన్నాహజారే కూడా అరవింద్ కు దూరమయ్యారు. . కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పరువంతా గంగలో కలవడంతోపాటు అన్నాహజారే కూడా అరవింద్ కు దూరమయ్యారు.