ఢిల్లీ మద్యం(Liquor) కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. ఆర్నెల్ల తర్వాత జైలు నుంచి జనంలో కలిశారు. ఆయనకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడంతో కారాగారం(Jail) నుంచి బయటకు వచ్చారు. ఈ మార్చి 21న ఆయన్ను అరెస్టు చేసి తీహార్ జైలుకు పంపారు.
ఆయన భార్య సునీత, పంజాబ్ CM భగవంత్ సింగ్ మాన్, ఢిల్లీ మంత్రి అతీశి సమక్షంలో కార్యకర్తల సందోహం నడుమ కేజ్రీవాల్ బయట అడుగుపెట్టారు. ‘నా నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు చెరసాలకు పంపారు.. కానీ నా ఆత్మవిశ్వాసం 100 రెట్లు పెరిగింది.. దేవుణ్ని నమ్ముతూ దేశానికి సేవ చేయడమే లక్ష్యం..’ అంటూ మాట్లాడారు.