భారత్-చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడి ఘర్షణ నెలకొన్న వాస్తవాధీన రేఖ(LAC) వద్ద.. నాలుగున్నరేళ్లకు మన బలగాలు పెట్రోలింగ్ నిర్వహించాయి. భారత బలగాలతోపాటు చైనా సైన్యం సైతం అటువైపు పెట్రోలింగ్ చేపట్టింది. తూర్పు లద్దాఖ్ లో ప్రశాంత వాతావరణం నెలకొనెలా ఇరుదేశాల కమాండర్లు ఇప్పటికే చర్చలు జరపగా.. బుధవారం నాడు బలగాల ఉపసంహరణ పూర్తయింది.
దీపావళి సందర్భంగా LAC ప్రాంతాల్లో స్వీట్లు పంచుకున్న ఇరు వర్గాలు.. ముందస్తుగా సమాచారం షేర్ చేసుకున్న తర్వాత దెప్సాంగ్(Depsang), దెమ్చొక్(Demchok) ప్రాంతాల్లో గస్తీ నిర్వహించాయి. 2020లో గల్వాన్ లోయలో పెట్రోలింగ్ సమయంలో ఘర్షణ తలెత్తి 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోగా, చైనాకు భారీ ప్రాణనష్టం జరిగింది. తర్వాత కాలంలో ఆయా ప్రాంతాల్లో రెండు దేశాల సైన్యాలు భారీగా మోహరించి యుద్ధ వాతావరణాన్ని సృష్టించాయి.