కాల్పుల విరమణ(Ceasefire) ఉల్లంఘించి దాడులకు పాల్పడుతున్న పాక్ కు బుద్ధిచెప్పేందుకు సైన్యానికి స్పష్టమైన ఆదేశాలు అందాయి. చొరబాటుకు యత్నించిన దుండగులపై ఆర్మీ కాల్పులు జరిపింది. సహనంతో ఉంటే దాయాది రెచ్చగొడుతోందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అన్నారు. శత్రు దేశం తీరు చూశాక సైన్యానికి పూర్తి అధికారాలిచ్చామన్నారు. రాజస్థాన్ జైసల్మేర్ లో మళ్లీ కాల్పుల మోత వినిపించింది. దీంతో సరిహద్దు రాష్ట్రాల ప్రిన్సిపల్ సెక్రటరీలతో హోంశాఖ కార్యదర్శి గోవింద మోహన్ చర్చలు జరిపారు.