
ఆమె ఉన్నతాధికారి.. భూలావాదేవీలతో కోట్లు సంపాదించడమే పని. CM ఆదేశాలతో ఆర్నెల్లుగా నిఘా పెట్టి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అస్సాం సివిల్ సర్వీస్(ACS) అధికారి నుపుర్ బోరా(Bora).. 2019లో జాబ్ లో చేరి ప్రస్తుతం కామరూప్ జిల్లా గొరోయ్మరి సర్కిల్ ఆఫీసర్ గా ఉన్నారు. హిందూ మత భూముల్ని బార్పేటలో అమ్మించగా, ఇప్పుడూ అదే జరుగుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. గువాహటి, బార్పేటలో సోదాలు జరిపిన CM స్పెషల్ విజిలెన్స్ సెల్.. రూ.90 లక్షలు, మరో కోటి విలువైన బంగారు నగల్ని స్వాధీనం చేసుకుంది. ఆమె కొలీగ్ సురాజిత్ డేకా సైతం దాడుల్లో దొరికారు. ఈ ఇద్దరూ భూముల్ని హాంఫట్ చేసినట్లు తేలిందని CM బిశ్వశర్మ ప్రకటించారు.
