హరియాణా ఎన్నికల ఫలితాల్లో అనూహ్యం చోటుచేసుకుంది. లెక్కింపు(Counting) మొదలైన రెండు గంటల వరకు కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం(Majority)లో ఉండగా.. ఆ తర్వాత సీన్ మారిపోయింది. అక్కడ భారతీయ జనతా పార్టీ(BJP) ఊహించని రీతిలో ఆధిక్యంలోకి వచ్చేసింది. తొలుత కాంగ్రెస్ 46 చోట్ల, BJP 35 చోట్ల లీడ్ లో ఉంటే.. ఆ తర్వాత BJP 43 స్థానాలకు ఎగబాకింది. హస్తం పార్టీ మాత్రం 34 స్థానాలకు దిగజారింది.
జమ్మూకశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్(JKNC), BJP మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. అయితే అక్కడ కాంగ్రెస్ సైతం సీట్లు సాధిస్తుండటంతో నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి మెజారిటీ దిశగా సాగుతోంది. JKలో 90 స్థానాలకు గాను నేషనల్ కాన్ఫరెన్స్ 36 చోట్ల, BJP 26 నియోజకవర్గాల్లో, కాంగ్రెస్ 9 స్థానాల్లో లీడ్ లో ఉన్నాయి. NC-కాంగ్రెస్ కూటమి మొత్తంగా 45 స్థానాల్లో ఆధిక్యంలో కనిపిస్తుండగా, PDP మాత్రం కేవలం మూడు స్థానాల్లోనే లీడ్ లో ఉంది.