అప్పుడే పిల్లలంతా బడిలో అడుగుపెట్టారు. 8 గంటలకు తరగతులకు చేరుకుంటే సరిగ్గా 8:30కు ఊహించని ప్రమాదం ముంచుకొచ్చింది. ఉన్నట్టుండి భవనం కూలడంతో నలుగురు పిల్లలు మృత్యువాత పడ్డారు. 40 మంది చిక్కుకోగా 17 మంది గాయాలతో బాధపడుతున్నారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన రాజస్థాన్ లోని ఝలావర్(Jhalawar) జిల్లా మనోహర్ థానా పిప్లొడిలో జరిగింది. గ్రామస్థులంతా వచ్చి పిల్లలు, టీచర్లని బయటకు తీశారు. ఒకే అంతస్తు గల భవనం శిథిలావస్థకు చేరిందని చెప్పినా పట్టించుకోలేదు. ఈ సర్కారీ స్కూల్ లో 8వ తరగతి వరకు ఉంది. కలెక్టర్ సహా జిల్లా యంత్రాంగమంతా ఘటనాస్థలికి చేరుకుంది.
మరిన్ని వార్తలకు క్లిక్ చేయండి…: https://justpostnews.com