ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన కార్యక్రమంలో ఓ వ్యక్తి ఏకంగా ముఖ్యమంత్రిపైనే దాడి చేశాడు. ఢిల్లీ CM రేఖా గుప్తా.. ఆమె నివాసంలో ‘జన్ సున్వాయ్’ అనే పబ్లిక్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. ఫిర్యాదుదారుడిగా వచ్చిన దుండగుడు ఒక్కసారిగా దాడికి పాల్పడటంతో.. CM భద్రతా సిబ్బంది అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. రేఖాగుప్తాను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమెపై దాడి చేసి వెంట్రుకలు పట్టి తోసేశారని BJP నేత హరీశ్ ఖురానా తెలిపారు. ముఖ్యమంత్రి ప్రతి వారం పబ్లిక్ మీటింగ్ నిర్వహిస్తుంటారు.