అయోధ్యలో నిర్మాణమవుతున్న రామ మందిరం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. 2024 జనవరిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని రామ మందిరం ట్రస్టు సభ్యులు తెలిపారు. రామజన్మభూమి ప్రారంభోత్సవం వచ్చే ఏడాది జనవరి మూడో వారంలో నిర్వహిస్తామని, 21 నుంచి 23 వరకు కార్యక్రమాలు జరగనున్నాయంటూ ఈ వేడుకకు ప్రధాని నరేంద్రమోదీని ఆహ్వానిస్తామని తెలియజేశారు. ఈ ప్రధాన ఘట్టాన్ని రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తామన్న ట్రస్టు సభ్యులు.. ప్రారంభోత్సవ వే డుకలకు వివిధ రాజకీయ పార్టీల నేతలను ఆహ్వానిస్తామన్నారు. ఈ వేడుకకు 136 సనాతన సంప్రదాయాలకు చెందిన 25 వేల మంది హిందూ మత పెద్దలను ఆహ్వానించాలని భావిస్తున్నట్లు ట్రస్టు అధ్యక్షుడు తెలియజేశారు.
2020 ఆగస్టు 5న రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా జనం తరలివచ్చే అవకాశం ఉందని భావిస్తున్న ట్రస్టు… రోజుకు లక్ష మందికి భోజనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.