బెంగళూరు బాంబు పేలుడు కేసులో కీలక ముందడుగు పడింది. ప్రధాన నిందితుణ్ని NIA(National Investigation Agency) అదుపులోకి తీసుకున్నట్లు జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. 10 రోజుల పాటు విస్తృతంగా గాలింపు జరిపిన పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. బాంబు పేలుడు కారకుడి ఆచూకీ(Address) చెబితే రూ.10 లక్షల రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటించారు. కర్ణాటకలోని బళ్లారిలో షబ్బీర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తున్నది.
ఈ నెల 1న…
బెంగళూరు కుందనహళ్లి రోడ్డులోని వైట్ ఫీల్డ్ ప్రాంతంలోగల రామేశ్వరం కేఫ్ లో ఈనెల 1న బాంబు పేలుడు జరిగి 10 మంది గాయపడ్డ సంగతి తెలిసిందే. CC టీవీ ఫుటేజీల ద్వారా నిందితుణ్ని గుర్తించిన పోలీసులు.. ఘటనకు పాల్పడిన వ్యక్తిని 25-30 ఏళ్ల యువకుడిగా పోల్చారు. ఇందుకోసం AI(Aritificial Intelligence) టెక్నాలజీని ఉపయోగించి నిందితుడి ముఖ కవళికల్ని గుర్తు పట్టారు. దీనిపై NIA, IB సంస్థలు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయి.