పచ్చని కొండలు, ఎత్తయిన పర్వతాలు… హిమ సోయగాలు… స్వచ్ఛమైన నదులు… ఎటు చూసినా ప్రకృతి పరవశిస్తుందా అన్న రీతిలో కనిపించే సహజ సౌందర్యాలకు నెలవు జమ్మూకశ్మీర్. ఉగ్రదాడులు, కాల్పులు, హింస, ఆందోళనలు ఇలా… కొన్నేళ్లలో కశ్మీర్ అంటేనే భయానక వాతావరణం కనిపించింది. సహజ సౌందర్య వాతావరణానికి పుట్టినిల్లుగా… భారతదేశానికి బంగారు కిరీటంలా ఉండాల్సిన కశ్మీర్… కాస్త ఆలస్యంగానైనా మెల్లమెల్లగా ఆ స్థాయికి చేరుకుంటోంది. తనివితీరని రీతిలో అబ్బురపరుస్తూ మనసును ఉల్లాసపరిచే కశ్మీర్ కొండల్లో ప్రస్తుతం పూర్తి ప్రశాంతత నెలకొంటోంది. టూరిస్టుల తాకిడి ఎక్కువవుతోంది.
2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ఆర్టికల్ 370 రద్దు చట్టం తర్వాత కశ్మీర్ ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. ఈ విషయాన్ని మోదీ సర్కారు సుప్రీంకోర్టులో అఫిడవిట్ ద్వారా తెలియజేసింది. 2022లో 1.88 కోట్ల మంది టూరిస్టులు జమ్మూకశ్మీర్ ను విజిట్ చేశారని, తీవ్రవాద కార్యకలాపాలు బాగా తగ్గిపోయాయని తెలిపింది. ఆర్టికల్ 370 రద్దును అపోజ్ చేస్తూ వచ్చిన పిటిషన్లపై సుప్రీం విచారణ సాగిస్తోంది. చీఫ్ జస్టిస్ D.Y.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి కేంద్రం అఫిడవిట్ సమర్పించింది. గత నాలుగేళ్లలో జమ్మూకశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాల్లో డెవలప్ మెంట్ స్పీడ్ అయిందని, ఈ ఏడాది మే లో G-20 మీటింగ్ ను నిర్వహించడమే అందుకు ఉదాహరణ అని వివరించింది.
కశ్మీర్ లో 2018లో రాళ్లు విసిరిన కేసులు 1,767 నమోదైతే అవి ఈ సంవత్సరం సున్నాకు చేరుకున్నాయని… సెక్యూరిటీ ఫోర్సెస్ మరణాల్లో 65.9 శాతం తగ్గుదల ఉన్నట్లు వివరించింది. బందులు, హర్తాళ్లకు గతంలో కశ్మీర్ నిలయంగా ఉండేదని కానీ 2023లో అటువంటి ఒక్క సంఘటనా జరగలేదని స్పష్టం చేసింది. 2018లో 199 మందిని తీవ్రవాదులు రిక్రూట్ చేసుకోగా… ఈ ఏడాది అది 18 మందికి చేరుకుందని అఫిడవిట్ తెలిపింది. మూడు దశాబ్దాల విధ్వంసం తర్వాత ప్రస్తుతం కశ్మీర్ లోయ ప్రశాంతంగా ఉందని, అక్కడి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్, గవర్నమెంట్ ఆఫీసులన్నీ కొత్తగా కనిపిస్తున్నాయని… వలసవెళ్లిన పండిట్లంతా వచ్చే ఏడాది కల్లా లోయకు తిరిగివస్తారని ధర్మాసనానికి వివరించింది.
Happy days to kashmiries
Happy days to kashmiris