హోటళ్లు, విందులు, వినోదాల్లో పశు మాంసాన్ని(Beef) నిషేధిస్తూ అసోం సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. హోటళ్లతోపాటు ఎలాంటి కార్యక్రమాల్లోనైనా పశు మాంసాన్ని వాడరాదంటూ ఆదేశాలు జారీ చేసింది. రెస్టరెంట్లు, హోటళ్లు, పబ్లిక్ ఫంక్షన్లు, ఇతర కార్యక్రమాలను బీఫ్ ను నిషేధిస్తున్నామని ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ప్రకటించారు. కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నామని, అందుకు సంబంధించిన చట్టాలను సవరిస్తున్నామన్నారు. ఇప్పటిదాకా ఆలయాల(Temples) సమీపంలో బీఫ్ ను తినడం నిషేధించగా, ఇప్పుడు అన్నిచోట్లా దాన్ని నిషేధించారు.