అసలే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై తలబొప్పి కట్టించుకున్న శివసేన(UBT) అధినేత ఉద్ధవ్ ఠాక్రేకి మరో షాక్ తగిలింది. బాబ్రీ మసీదు కూల్చివేతపై ఆయన అనుచరులు ప్రవర్తించిన తీరును నిరసిస్తూ సమాజ్ వాదీ పార్టీ(SP).. మహా వికాస్ అఘాడీ(MVA) అలయెన్స్ నుంచి వైదొలిగింది. మహారాష్ట్ర అసెంబ్లీలో SPకి ఇద్దరు MLAలు ఉండగా.. ఇప్పుడు అఖిలేశ్ యాదవ్ నిర్ణయంతో కాంగ్రెస్ కూటమి మరింత ఇరకాటంలో పడింది. బాబ్రీ కూల్చివేత జరిగి 32 సంవత్సరాలు పూర్తయిన వేళ.. శివసేన(UBT) నేత మిలింద్ నర్వేకర్ ఫొటో పోస్ట్ చేయడం వివాదానికి దారితీసింది.
శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే ఆనాడు మాట్లాడారని గుర్తు చేస్తూ ఫొటోను పోస్ట్ చేశారు. ‘బాబ్రీపై వివాదాస్పద రీతిలో బాల్ ఠాక్రే మాట్లాడారంటూ మరోసారి నర్వేకర్ గుర్తు చేయడంతోపాటు దానికి ఉద్ధవ్, ఆదిత్య ఠాక్రేల ఫొటోల్ని జతచేయడంతో పార్టీల మధ్య అగ్గి రాజుకుంది. దీన్ని నిరసిస్తూ SP అధినేత అఖిలేశ్.. అలయెన్స్ నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్(16 సీట్లు)-శివసేన(UBT-20), NCP(SP-10) కలిపితే ఈ కూటమికి మొత్తం 46 రాగా, SPవి రెండు కలిపి 48 అయ్యాయి.