ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన అయోధ్య, బద్రీనాథ్ ఎంతటి ప్రాశస్త్యమున్న(Prosperity) ప్రాంతాలో అందరికీ తెలిసిందే. జనవరి 22న శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠతో అయోధ్య.. ఛార్ ధామ్ లలో ఒకటైన బద్రీనాథ్.. చారిత్రక ప్రదేశాలుగా పేరుపొందాయి. ఈ రెండు ఆలయాలు గల రాష్ట్రాల్లో BJPనే అధికారంలో ఉన్నా.. ఆ రెండు చోట్లా కమలం పార్టీకి పరాజయాలే ఎదురయ్యాయి.
రెండింటినీ…
లోక్ సభ ఎన్నికల తర్వాత తాజాగా ఏడు రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ సెగ్మెంట్ల ఉప ఎన్నికల్లో 13కు 11 స్థానాల్ని NDA కోల్పోయింది. ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ లో కాంగ్రెస్ అభ్యర్థి లఖ్పత్ సింగ్ బుటోలా మూడున్నర వేల మెజార్టీతో గెలుపొందారు. ఇదొక్కటే కాదు.. ఆ రాష్ట్రంలో జరిగిన మరో స్థానమైన మంగలోర్ లోనూ BJP ఓడిపోయింది.
అయోధ్యలో…
మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో అయోధ్య కలిగిన నియోజకవర్గమైన ఫైజాబాద్ లో BJP అభ్యర్థికి షాక్ తగిలింది. లల్లూ సింగ్ పై సమాజ్ వాదీ పార్టీకి చెందిన అవధేశ్ ప్రసాద్ 40 వేల ఓట్ల భారీ తేడాతో గెలిచారు. రాజ్యాంగాన్ని మారుస్తారన్న బలమైన ప్రచారమే BJP కొంపముంచిందని చెప్పుకుంటున్నారు.