
బిహార్ అసెంబ్లీ తొలివిడత ఎన్నికలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. భద్రతా కారణాలతో కొన్ని చోట్ల ఐదింటి వరకే ఓటింగ్ ఉంటుంది. మొత్తం 1,314 మంది పోటీచేస్తుండగా, 3.75 కోట్ల మంది ఓటర్లున్నారు. NDA నుంచి JDU అత్యధికంగా 57 చోట్ల, BJP 48 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. అటు మహాగట్ బంధన్ కూటమి నుంచి RJD 73 చోట్ల, కాంగ్రెస్ 24 చోట్ల బరిలోకి దిగాయి. ప్రశాంత్ కిశోర్ పార్టీ జనసురాజ్ నుంచి 119 మంది సై అంటున్నారు.