
అరాచకాల్ని అరికట్టి బిహార్ బ్రాండ్ ఇమేజయ్యారు నితీశ్ కుమార్. 6 సార్లు MPగా, పలుసార్లు కేంద్రమంత్రిగా, 9 సార్లు CMగా పనిచేశారు. అవినీతి లేని నేత అన్న ఇమేజ్ తో ప్రభుత్వ వ్యతిరేకత మాయమైంది. పట్నా సమీప భక్తియార్ పూర్లో 1951లో జన్మించి ఇంజినీరింగ్ పూర్తయ్యాక విద్యుత్తు బోర్డులో పనిచేశారు.
1977లో జనతాపార్టీ నుంచి తొలిసారి, 1980లో హర్నాట్ నుంచి రెండోసారీ ఓడిపోయారు. 1985లో అక్కణ్నుంచే గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2010 నుంచి 2014 వరకు తర్వాత 2015 నుంచి ఇప్పటిదాకా CMగా కొనసాగుతున్నారు. లోక్ సభకు 6 సార్లు గెలిచి ఎన్నోసార్లు కేంద్ర మంత్రి పదవులు అలంకరించారు.