
బిహార్ చరిత్రలో తొలిసారి పురుషాధిక్యానికి గండి పడటం వల్లే భారీగా ఓటింగ్ నమోదైంది. అందువల్లే NDAకు బంపర్ మెజార్టీ దక్కినట్లు చర్చించుకుంటున్నారు. పోలింగ్ బూత్ లలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ కనిపించారు. 62.8% మంది పురుషులు ఓటేస్తే, 71.6% మహిళలు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. అంటే మగవారి కంటే 9 శాతం ఎక్కువగా మహిళా ఓట్లు పడ్డాయి. ఇది రాష్ట్ర రాజకీయాల్లో చరిత్రాత్మకం కాగా, ఇలా బిహార్ విజేతలుగా మహిళలే నిలిచారు.