
మణిపూర్ లోకి అక్రమంగా(Illegal) ప్రవేశిస్తున్న వారిని గుర్తించేందుకు బయోమెట్రిక్ సిస్టమ్(Systen) అమలు చేస్తున్నారు. మయన్మార్ నుంచి వచ్చిన శరణార్థులతోపాటు అక్రమ వలసదారుల్ని గుర్తించి తిప్పి పంపేందుకు ఈ సిస్టమ్ ఉపయోగిస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘర్షణలకు నార్కో టెర్రరిజం కూడా కారణమని భావిస్తున్న బీరేన్ సింగ్ సర్కారు.. ఇల్లీగల్ గా ప్రవేశించేవారి వివరాలు సేకరిస్తోంది. మణిపూర్ ప్రజల నుంచి బయోమెట్రిక్ డేటా సేకరిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అన్ని జిల్లాల్లో డేటా తీసుకునేందుకు నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో(NCRB) నుంచి ఆ రాష్ట్రానికి ప్రత్యేక బృందాలు(Special Teams) వచ్చాయి. సెప్టెంబరు చివరి నాటికి దీన్ని పూర్తి చేయనున్నామని అధికారులు తెలిపారు.
మణిపూర్ లో విదేశీ హస్తం ఉందని CM బీరేన్ సింగ్ గతంలోనే ప్రకటించారు. అటు శివసేన MP సంజయ్ రౌత్ కూడా ఇదే అభిప్రాయాన్ని చెప్పారు. ఇల్లీగల్ గా ఆయుధాలు సరఫరా చేస్తున్న వ్యక్తులను కొద్దిరోజుల క్రితమే ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ గుర్తించి కొందరిని అరెస్టు చేసింది. ఇప్పుడీ బయోమెట్రిక్ సిస్టమ్ ద్వారా నేరాలు అదుపులోకి వస్తాయని సర్కారు నమ్మకంతో ఉంది.