
బిహార్ శాసనసభ ఎన్నికల్లో NDA కూటమి తిరుగులేని రీతిలో దూసుకుపోతోంది. మూడింట రెండొంతుల స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 181 స్థానాల్లో NDA లీడ్ లో ఉంటే మహాఘట్ బంధన్(MGB)అలయెన్స్ కేవలం 57 స్థానాల్లోనే ముందంజలో ఉంది. ఈ రాష్ట్రంలో BJP ఆధ్వర్యంలోని NDA కూటమిదే ప్రభుత్వమని ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. వాటి సర్వేలు నిజమేనా అన్నట్లు మెజార్టీ ప్రాంతాల్లో ఆ కూటమి ప్రభంజనమే కొనసాగుతోంది. CM నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్-యూ(JDU) సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలవబోతోంది. 101 సీట్లలో పోటీ చేస్తే 84 చోట్ల ముందంజలో కొనసాగుతోంది.