జగదీప్ ధన్ ఖడ్ రాజీనామాతో ఉపరాష్ట్రపతి(Vice President) పదవిని భర్తీ చేయాల్సి ఉంది. త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో ఆర్నెల్లలోపు నియామకం చేపట్టాల్సి ఉండగా, సీనియర్ల కోసం BJP జల్లెడ పడుతోంది. గవర్నర్లు, కేంద్ర మంత్రులు, సంఘ్ మూలాల్ని పరిగణలోకి తీసుకోనుంది. ధన్ ఖడ్ సైతం గతంలో బెంగాల్ గవర్నర్ గా పనిచేశారు. ఈయన కన్నా ముందు వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా ఉన్నారు. ఈ పదవి నుంచి రాజీనామా చేసిన మూడో వ్యక్తి ధనఖడ్. గతంలో వి.వి.గిరి, ఆర్.వెంకట్రామన్ రాజీనామా చేయగా, వారిద్దరూ రాష్ట్రపతి పదవి కోసం సీటు వదులుకున్నారు.