BJP తెలంగాణ నేత పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజకీయాంశాల్లో జోక్యం చేసుకోబోమంటూ CJI బి.ఆర్.గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్, జస్టిస్ అతుల్ ఎస్.చందూర్కర్ బెంచ్ డిస్మిస్ చేసింది. రాజ్యాంగాన్ని(Constitution) మారుస్తున్నారంటూ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారన్నది CM రేవంత్ రెడ్డిపై ఆరోపణ. క్రిమినల్ పరువు నష్టం దావాను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారం వెంకటేశ్వర్లు వేశారు. గత నెలలోనే దీన్ని హైకోర్టు కొట్టివేస్తే సుప్రీంను ఆశ్రయించారు. కేంద్రంలో BJP అధికారంలోకి వస్తే SC/ST/OBC రిజర్వేషన్లు తొలగిస్తుందంటూ ప్రచారం చేశారన్నది పిటిషనర్ వాదన.