రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ దూకుడు కొనసాగుతూనే ఉంది. మొన్ననే ఢిల్లీ ఎన్నికల్లో గెలిచిన ఆ పార్టీ.. తాజాగా ఛత్తీస్ గఢ్(Chhattisgarh)లో పదింటికి 10 మేయర్ స్థానాల్ని గెలుచుకుంది. 44.90 లక్షల మంది ఓటర్లకు గాను 72.19 శాతం పోలింగ్ నమోదైంది. కరియా(Koriya)లో 84.97%, గరియాబాద్ జిల్లాలో 84.65% అత్యధికంగా పోలింగ్ నమోదైతే రాయపూర్(52.75%), బిలాస్ పూర్(51.37%) జిల్లాల్లో అతి తక్కువ శాతం రికార్డయింది. ఇలా అన్నిస్థానాల్ని అధికార పార్టీ స్వీప్ చేసి ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో నిలిచింది. ఈ విజయంపై CM విష్ణుదేవ్ సాయ్ ని BJP అధ్యక్షుడు జె.పి.నడ్డా అభినందించారు.