దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(BJP)దూసుకుపోతోంది. మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(AAP)అధినేత అరవింద్ కేజ్రీవాల్ వెనుకంజలో ఉన్నారు. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన.. కమలం పార్టీ అభ్యర్థి పర్వేజ్ సాహిబ్ సింగ్ వర్మ కన్నా వెనుకబడ్డారు. మొత్తం 70 సెగ్మెంట్లకు ఎన్నికలు జరిగితే ప్రస్తుతానికి 42 చోట్ల BJP ఆధిక్యంలో ఉంది. ఆప్ 27 స్థానాల్లో లీడ్ లో ఉంటే కాంగ్రెస్ కేవలం 1 చోట మాత్రమే ప్రత్యర్థి కన్నా ముందంజలో ఉంది. ఇలా ప్రాథమిక రౌండ్లలోనే కమలం పార్టీ మెజార్టీ సీట్లను దాటింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఆప్ అగ్రనేతలు కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, CM అతీశీ, వెనుకంజలో ఉంటే.. BJP అభ్యర్థులు పర్వేశ్ వర్మ, రమేశ్ బిదూరి, కపిల్ మిశ్రా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 27 ఏళ్ల తర్వాత అధికార పీఠం దక్కించుకునే దిశగా కమలం పార్టీ దూసుకుపోతోంది.
అక్కడి కీలక నేతల పరిస్థితి ఇలా…
* న్యూఢిల్లీ స్థానంలో కేజ్రీవాల్ వెనుకంజ.. BJP అభ్యర్థి పర్వేజ్ సాహిబ్ సింగ్ వర్మ ఆధిక్యం
* సీఎం అతీశీ.. కల్కాజీ స్థానంలో వెనుకంజ, BJP అభ్యర్థి రమేశ్ బిదూరి ఆధిక్యం
* జంగ్ పురాలో.. మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా వెనుకంజ
* పత్పర్ గంజ్ లో AAP అభ్యర్థి అవధ్ ఓజా వెనుకంజ…
* బల్లిమారన్ స్థానంలో AAP అభ్యర్థి ఇమ్రాన్ హుస్సేన్ వెనుకంజ…
* ఓక్లా స్థానంలో AAP అమానతుల్లాఖాన్ వెనుకంజ…
* షాకుర్ బస్తీలో AAP అభ్యర్థి సత్యేంద్ర కుమార్ జైన్ ముందంజ…
* గాంధీనగర్లో BJP అభ్యర్థి అర్విందర్ సింగ్ లవ్లీ ముందంజ…